Meteorite logoMeteorite
Back to videos

BATHUKAMMA SONG 2025 | SINGER VARAM | SEETHAKKA | AZAAD MUSIC

BATHUKAMMA SONG 2025 | SINGER VARAM | SEETHAKKA | AZAAD MUSIC CREDITS: Lyrics,Singer :Azaad (Chandhrashekhar) Singer : Varam Music : Azaad Programming : Manoj Chorus: Rachitha, Punitha , Harshitha DOP: Kamili Cast : Azaad , Komali Rythms : Chiranjeevi, Anil Robin Editing &Di : anneboyina Srinivas Mix & Master : Balu K Poster :Rana Special thanks to Bulletbandi laxman, Nitheesh and Upender Like .share,Subscribe & Comment… ధరణి సిగల ఓ పొద్దోలే పొడిసే నిప్పులా సెగలా సీకట్లను తొలిసే నింగి మబ్బులా వెండి వెన్నెలై కాసే గాలిలోన పుప్పొడి గంధమయ్యిందే అలుగు దుంకిన సెరువును హత్తుకుందే మట్టిమనుషుల గట్టి బంధమాయే ఎల్లలులేని ప్రకృతివే బతుకమ్మా ఎనలేని సంస్కృతితో పొందిన జన్మ ఏ తల్లి నిను కనలే బతుకమ్మా ఈ పుడమికి సొంతం అయినవ్ బతుకమ్మ రామానందలాలో శ్రీ దేవానందలాలో రానే వచ్చేనే బతుకమ్మా పండుగ రామాఉయ్యాలో దేవనా వుయ్యాలో ఇరగబూసినాయమ్మ కొమ్మల పూలో పుట్టిల్లు సేరిన సెల్లే అరుగు మీద గొబ్బీయల్లో మురిసిపోయేనే తెచ్చిన పూలను చూసి రామా నందలాలో తాంబాళంలోన తడి ఆరక ముందే గుమ్మడి పూవు దోసిళ్లతో పెనవేసుకు కూసోనుందే గొబ్బియల్లో సూరెక్కి ఎగబాకి సూసేనే సెల్లే బీర పూవు తీగయ్యి రాగాలను వినిపించిందే రామానందలాలో వాకిలినే అలుకుసానుపు సల్లుతుంటే గుమ్మాల తోరణమే మెరిసినాదే పసుపు పారాణి పాదాలకెడితే.. కాళ్ల పట్టి సందడి చేసినాదే పసుపు ముద్దకు కుంకుమ తిలకాన్ని దిద్దితే పసిడి కాంతితో వెలిగే గౌరమ్మ… పూలనే చీరగకట్టి బతుకమ్మయ్యిందో రామన ఉయ్యాలో బతుకమ్మ సుట్టూ చేరి సప్పట్లుతోని ఆటలు ఆడాలో తంగేడు గునుగమ్మ తరలివచ్చినాయో భారతిసీరియల్ల సింగిడయ్యినాయో భారతి సీరియల్లా బంతి గోరింటాలు బాసలాడినాయో భారతి సీరియల్ల ఊసులాడినాయో భారతిసీరియల్ల పట్టుకుచ్చు, టేకు పూలు పరవశించినాయో భారతి సీరియళ్ల పారాడినాయో భారతిసీరియల్ల నంది వర్ధనపూలే నవ్వులోలికినయి ముద్ద మందారం,చామంతి తలలే తిప్పే… సీతాజడల పూలే సిగ్గులొలికినాయే ముస్తాబై బతుకమ్మ బయలెళ్లితే … పంట కంకి ఇంటిలో నవధాన్యామాయే … ఎంగిలిపూలతో నైవేధ్యం అయ్యిందే.. ఎత్తుకుంటే ఊరు పాలపుంతగా మారే రామ రామ ఉయ్యాలో రామన ఉయ్యాలో కోలలు పట్టి ఆడే కోలాటాలో రామ రామ ఉయ్యాలో దేవన ఉయ్యాలో బతుకమ్మపాటతో ఊరేగాలో పాల పిట్ట సూడాలే జమ్మి చెట్టు ఎక్కాలే పలుగు పారను మొక్కి దండం పెట్టాలే .. జడ్తా ఇస్తే జూడాలే యాటను బలి ఇయ్యాలే పొత్తి పొలిమేర సుట్టూ పోయాలే… మళ్లీ రావే బతుకమ్మని మనసార తలుచుకుంటూ అలలా మీద సాగనంపి సేరువు ఒడి నిండా బతుకమ్మను కొలువుంచి వచ్చేయేడు రమ్మని వేడుకుందురు మళ్లీ రావే బతుకమ్మని వేడుకుందురు మళ్లీ రావే బతుకమ్మని వేడుకుందురు #bathukammasongs2025 #bathukamma #newbathukammasongs #folksongs2025 #seethakkasongs #bathukammadjsongs #singervaram #azaadmusic #telugufolksongs #varamfolksongs #bangarubathukammasongs #manglibathukammasong #newfolksongs #v6bathukamma #seethakka #janulyrifolksongs #janu #bhole #trending #trendingshorts #trendingreels #trendingsong #mangli #folksong #newfolksongs #revanthreddy #kalvakuntlakavithakkabathukammasong #song #newbathukammasongs2025 #matlathirupathibathukammasongs #manglinewbathukammasong

Suggested videos